దీనికి ఇప్పటికే అభిమానుల్లో పెద్ద ఆసక్తి రేకెత్తించింది. ఓ జీ.. ఎవ్వరికి అంధదు అథాని రేంజ్... రెప్ప తెరిచేను రగిలే పగ... అంటూ చిన్న క్యాప్షన్ కూడా జోడించారు. దర్శకుడు సుజిత్ ఈ సినిమాలో పలువురుని ఎంపిక చేశాడు. ఇప్పటికే ఇమ్రాన్ హష్మీ, ప్రియాంక అరుల్ మోహన్, శ్రియారెడ్డి, సీనియర్ నటుడు వెంకట్ తదితరులు నటిస్తున్నారు.
250 కోట్లకు పైగా బడ్జెట్ తో ఓజీని రూపొందిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. డీవీవీ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఇటీవలే హరిహర వీరమల్లు సినిమా షూట్ త్వరలో చేయబోతున్నట్లు నిర్మాత ఎ.ఎం. రత్నం తెలిపారు. మరి ఓజీ కి పవన్ టైం కేటాయిస్తాడో.. ఆంధ్ర ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించిన పవన్ షూటింగ్ కు కాస్త గ్యాప్ ఇస్తాడో చూడాలి.