ఆ యుగపురుషుని పేరు కలిసొచ్చేట్లుగా, నూతన కళాకారుల పరిచయ వేదికగా New Talent Roars @ (NTR@) అనే బ్యానర్ ద్వారా నా మిత్రులు నా దర్శకత్వంలో ఒక చిత్రాన్ని నిర్మించాలని సంకల్పించారు. ఆ బ్యానర్ పేరు (NTR@) తోనే, నా ఆధ్వర్యంలో ఎటువంటి లాభాపేక్షలను ఆశించకుండా.. ఆయన కుటుంబ సభ్యులు, బంధువుల సహకారంతో.. కులం, మతం, ప్రాంతం, పార్టీలకు అతీతంగా ఆయన సమకాలీకులు, సన్నిహితులు, సహచరులు, అధికారులు, ఆయనతో పనిజేసిన సిబ్బంది, ఇంకా ఆయనతో ప్రత్యక్ష, పరోక్ష సంబంధాలున్న వారందరితో, మరీ ముఖ్యంగా ఆయన అభిమానులతో వారి వారికున్న అనుభవాల్ని, అనుబంధాల్ని.ఉత్సుకతతో నిండిన, ఆకర్షణీయమైన ఇంటర్వ్యూలుగా మలుస్తున్నాను.
రాబోయే ఆయన శత జయంతి (28 మే, 2022) రోజు నుండీ సంవత్సరం పాటు (27 మే 2023 వరకూ).. ఆ ఇంటర్వ్యూలను రకరకాల డిజిటల్ వేదికల ద్వారా.. ఆయన జ్ఞాపకాల రూపంలో ప్రపంచ వ్యాప్త తెలుగు ప్రజానీకానికి చేరువ చేయాలనే బృహత్తర ప్రణాళికకు.. రూపకల్పన చేయడం జరిగింది అని..ఎన్. టి. ఆర్.99వ జయంతి సందర్భంగా, మీకందరికీ తెలియజేయడానికి నేను సంతోషిస్తున్నాను,గర్విస్తున్నాను.ఇలాంటి కార్యాచరణలతో మరెంతో మంది అన్నగారి అభిమానులు ముందుకు రావాలని ఆశిస్తున్నాను,వస్తారని విశ్వసిస్తున్నాను.అని వై వి ఎస్ చౌదరి ప్రకటించారు.