చెక్ బౌన్స్ కేసులో నిర్మాత బండ్ల గణేశ్‌కు అరెస్టు వారెంట్

సోమవారం, 27 డిశెంబరు 2021 (13:53 IST)
తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన ప్రముఖ నిర్మాత, హీరో పవన్ కళ్యాణ్ వీరాభిమాని బండ్ల గణేశ్‌కు ఏపీలోని ఒంగోలు జిల్లా రెండో ఏఎంఎం కోర్టు తాజాగా అరెస్టు వారెంట్ జారీచేసింది. ఓ చెక్ బౌన్స్ కేసులో బండ్ల గణేశ్‌కు కోర్టు ఈ వారెంట్‌ను జారీచేసింది. 
 
ఈ జిల్లాలోని ముప్పాళ్ళ గ్రామానికి చెందిన జెట్టి వెంకటేశ్వర్లు అనే వ్యక్తికి బండ్ల గణేశ్ రూ.1.25 కోట్లకు ఓ చెక్ ఇచ్చారు. ఆ చెక్కును బ్యాంకులో వేయగా, తగినంత మొత్తంలో నిధులు లేకపోవడంతో ఆ చెక్క బౌన్స్ అయింది. దీంతో ఆయన కోర్టును ఆశ్రయించాడు. 
 
ఈ కేసు విచారణ పలుమార్లు జరుగగా, బండ్ల గణేశ్ హాజరుకాలేదు. దీంతో బండ్ల గణేశ్‌ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచాల్సిందిగా పోలీసులను ఆదేశించారు. ఫలితంగా ఆయన సోమవారం బండ్ల గణేశ్ కోర్టుకు రానున్నారు. 
 
గతంలో కూడా కడపకు చెందిన మహేష్ అనే వ్యక్తి వద్ద రూ.13 కోట్ల రుణం తీసుకున్న బండ్ల గణేశ్‌పై తిరిగి చెల్లించకపోవడంతో దానిపై కూడా కేసు నమోదైవుంది. ఈ కేసులో కూడా బండ్ల గణేశ్ హాజరుకాకపోవడంతో కడప కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీచేసింది. ఆ తర్వాత ఆయన్ను పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచిన విషయం తెల్సిందే. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు