తెలుగు చిత్ర పరిశ్రమలో దూసుకుపోతున్న ఈ భామ ఇప్పుడు కేన్స్ ఫెస్టివల్‌లో పాల్గొనేందుకు తోటి స్టార్ నటీమణులు దీపికా పదుకొణె, ఐశ్వర్యరాయ్ బచ్చన్, కంగనా రనౌత్, సోనమ్ కపూర్ అహుజా, ప్రియాంక చోప్రాలతో కలిసి ఉంది. గతంలో ఆమె సీనియర్స్ రెడ్ కార్పెట్ మీద నడిచి, ప్రపంచవ్యాప్తంగా జరిగిన సినిమాల వేడుకలకు హాజరైన తర్వాత, పూజా హెగ్డే ఈ సంవత్సరం ఇలా పాల్గొనడం విశేషం.