నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన షేర్ ఆడియో విడుదల కార్యక్రమం శనివారం రాత్రి హైదరాబాద్లో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'అనురాగదేవత' అనే సినిమాను తన సొంత బ్యానర్లో నిర్మించి, తమ సోదరులిద్దరితో మాటలు రాయించిన ఘనత నందమూరి తారకరామారావుదని చెప్పారు.
మాటల రచయితలుగా నిలదొక్కుకునే ప్రయత్నాలు చేస్తున్నప్పుడు ఓసారి రామారావుగారు ఓ షూటింగ్ లో ఉండగా, తాను వర్షంలో నిలబడ్డానని, అప్పుడు రామారావుగారు 'బ్రదర్, ఇలా రండి' అంటూ పిలిచారని, 'నీడ' దొరికిందని అప్పుడే ఫీలయ్యామని ఆయన చెప్పారు.