కొబ్బరిబోండాం తాగడానికి ఇదే బెస్ట్ వే అంటోన్న అకీరానందన్?

శుక్రవారం, 10 జూన్ 2022 (18:57 IST)
Akira Nandan
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కుమారుడు అకీరా నందన్ సినీ అరంగేట్రానికి రంగం సిద్ధం అవుతోంది. తండ్రిలా మార్షల్‌ ఆర్ట్స్‌లో ప్రావీణ్యం పొందిన అకీరా. కరోనా సమయంలో ఆర్థులకు సాయం అందించి మంచి మనసుకున్న కుర్రాడు అనిపించుకున్నాడు. ఈ క్రమంలో అకీరా వెనుక తల్లి రేణు దేశాయ్‌ ఉన్నారనేది తెలిసిన విషయమే.
 
తాజాగా రేణు దేశాయ్‌ తన కుమారుడి ఆలోచనల్ని తన సోషల్ మీడియా వేదికగా చూపించారు. అకీరా కొబ్బరి బొండాం తాగుతున్న ఓ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. అకీరా ఆ ఫొటోల్లో చాలామందిలా స్ట్రాతో కొబ్బరిబొండా తాగడం లేదు. నేరుగా బొండాం తాగేస్తున్నాడు.  
 
''కొబ్బరిబోండాం తాగడానికి ఇదే బెస్ట్ వే. స్ట్రా లేదు, ప్లాస్టిక్ లేదు, ప్రకృతికి ఎలాంటి నష్టం లేదు' అంటూ అకీరా ఫొటో పోస్ట్‌ చేసి రాసుకొచ్చారు రేణు దేశాయ్‌. 
 
దీంతోపాటు అదే పోస్ట్‌లో ఓ మహిళ గురించి కూడా రాసుకొచ్చారు రేణు దేశాయ్‌. ''ఈషా ఫౌండేషన్ నుండి కోయింబత్తూర్ ఎయిర్ పోర్ట్ కి వెళ్లే దారిలో ఈ మహిళ కొబ్బరి బొండాలు అమ్ముతున్నారు.
 
ఆమె ఫొటో తీసుకున్న సమయంలో 'మేం ఆనందంగా ఉండడానికి డబ్బు మీద ఆధారపడాల్సిన అవసరం లేదని' చెప్పారు అని రాసుకొచ్చారు రేణు దేశాయ్‌. అలా ఒకే పోస్ట్‌లో ఇటు నో ప్లాస్టిక్‌ సందేశం, మరోవైపు మహిళా సాధికారతను చూపించారు రేణు దేశాయ్‌.  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు