పవన్ - త్రివిక్రమ్‌ల సినిమాను ఆగస్టు 11న విడుదల చేసేందుకు మాటల మాంత్రికుడు సర్వం సిద్ధం చేసుకున్నాడు. మరోవైపు, ఇప్పటికే ఆగస్టు 11న ఖర్చీప్ వేసేశాడు ఎన్టీఆర్. బాబీ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇందులో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేయనున్నాడు.
ఎన్టీఆర్ సరసన కాజల్, అనుపమ, నివేదా థామస్‌లు జతకట్టనున్నారు. ఈ చిత్రాన్ని ఎట్టిపరిస్థితుల్లో ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ఎన్టీఆర్ డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. ఈ మేరకు దర్శకుడు బాబీకి గట్టి హెచ్చరికలు కూడా చేశాడట.