దొండ కాయలో ఎన్నో ఔషధ గుణాలున్నాయని ఆయుర్వేద వైద్య శాస్త్రం చెపుతుంది. దొండలో విటమిన్లు, ఖనిజాలు, పీచు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. దొండ కాయలు మన ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటో తెలుసుకుందాము.
దొండ కాయలో వున్న యాంటీ బ్యాక్టీరియల్ గుణాలున్నాయి, వీటి వల్ల జలుబు, దగ్గు దరిచేరవు.
దొండలోని బి-విటమిన్ నాడీవ్యవస్థకు మేలు చేస్తుంది. ఆందోళన, మూర్ఛ వ్యాధులతో బాధపడేవాళ్లకి బాగా పనిచేస్తుంది.