పవన్‌కు ఆ సినిమా నచ్చలేదట

గురువారం, 28 మే 2020 (23:21 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాతో రీ-ఎంట్రీ ఇస్తున్నారు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్‌ను జులైలో స్టార్ట్ చేయనున్నట్టు సమాచారం. టాలీవుడ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు - బాలీవుడ్ ప్రొడ్యూసర్ బోనీకపూర్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమా తర్వాత క్రిష్ డైరెక్షన్లో సినిమా చేస్తున్నారు. సీనియర్ ప్రొడ్యూసర్ ఎ.ఎం.రత్నం ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
 
ఈ సినిమా తర్వాత హరీష్ శంకర్‌తో సినిమా చేయనున్నారు. ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించనుంది. అయితే.. పవన్ కళ్యాణ్‌ మరో సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. ఇంతకీ ఏ సినిమా అంటే... మలయాళంలో విజయం సాధించిన డ్రైవింగ్ లైసెన్స్ సినిమాని తెలుగులో రీమేక్ చేయాలనుకుంటున్నారు.
 
ఈ రీమేక్‌లో పవన్ నటించనున్నట్టు ప్రచారం జరిగింది. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే... ఇటీవల పవన్ ఈ మూవీని చూసారట. తను ఈ సినిమా చేస్తే బాగోదని చెప్పినట్టు సమాచారం. దీంతో పవన్ డ్రైవింగ్ లైసెన్స్ రీమేక్‌లో నటించనున్నారు అనే వార్తకు బ్రేక్ పడినట్టే. మరి.. ఈ రీమేక్‌లో ఎవరు నటిస్తారో చూడాలి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు