పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తనయుడు అకీరా నందన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తండ్రిలాగే బాక్సింగ్, కరాటే లాంటి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటోన్న ఈ స్టార్ కిడ్‌కు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ భారీగానే ఉంది. తాజాగా మొదటి సారి రక్తదానం చేశాడు అకిరా నందన్. ఈ విషయాన్ని అతడి తల్లి రేణు దేశాయ్ సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో పంచుకుంది.