అమలాపురం కిమ్స్ వైద్య కాలేజీలో ఫుడ్‌ పాయిజనింగ్

గురువారం, 21 ఏప్రియల్ 2022 (14:52 IST)
కోనసీమ జిల్లా అమలాపురంలో పరిధిలో ఉన్న కిమ్స్ వైద్య కాలేజీలో గురువారం ఫుడ్‌ పాయిజనింగ్ ఘటన చోటుచేసుకుంది. వైద్య కాలేజీకి అనుబంధంగా ఉండే నర్సింగ్ కాలేజీ కూడా కొనసాగుతోంది. ఈ నర్సింగ్ కాలేజీకి చెందిన హాస్టల్‌కు చెందిన విద్యార్థులు గురువారం మధ్యాహ్నం భోజనం చేసిన బీఎస్సీ నర్సింగ్ విద్యార్థినిలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. 
 
బీఎస్సీ ద్వితీయ సంవత్సలం చదువుతున్న విద్యార్థినిలు చేసిన భోజనం విషపూరితమని తేలింది. దీంతో 50 మంది వరకు విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. వీరందరినీ హుటాహుటిన కిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఒకేసారి 50 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కాలేజీ యాజమాన్యం ఆందోళనకు గురైంది. ఈ ఘటనపై అంతర్గత విచారణకు ఆదేశాలు జారీచేసింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు