దాదాపు 400 ఆవులతో గోశాలను నిర్వహించడంపై కొనియాడారు. చాంద్ బాషా గురించి తెలుసుకున్న పవన్ ఆయన్ను హైదరాబాద్ పిలిపించుకుని సన్మానించారు. అనంతనం బాషా స్పందిస్తూ.. మారుమూల ప్రాంతంలో వున్న నన్ను గుర్తించి సన్మానించడం ఆనందదాయకం. గోశాలకు ఎలాంటి సాయం కావాలన్నా అడగమన్నారు. గో ఆధారిత వ్యవసాయం గురించి అడిగి తెలుసుకున్నారు. గోమూత్రం, ఆవుపేడతో భూసారం పెంచే కషాయం, ఎరువులు తయారు చేస్తున్నామని తెలిసి అభినందించారు. ఇలా సన్మానించడం నాలాంటివారికి స్పూర్తిని కలిగిస్తుందని తెలిపారు.
పవన్‌ను కదిలించిన జానపదాలు
అదేవిధంగా, శ్రీ పెంచల్ దాస్ గారు రాయలసీమ ప్రాంత జానపదాలను, అక్కడి మాండలికాన్నీ నేటి తరానికి చేరువ చేస్తున్న విధానం అభినందనీయం అని శ్రీ పవన్ కళ్యాణ్ గారు అన్నారు. గీత రచయిత, గాయకుడు శ్రీ పెంచల్ దాస్ గారు మంగళవారం హైదరాబాద్‌లో శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కలిశారు. ఈ సందర్భంగా తెలుగు జానపదాలు, సీమ మాండలికంపై ఇరువురు మాట్లాడుకున్నారు. ఈ చర్చలో ప్రముఖ దర్శకులు శ్రీ త్రివిక్రమ్ గారు పాల్గొన్నారు. అనంతరం శ్రీ పెంచల్ దాస్ గారిని శ్రీ పవన్ కళ్యాణ్ గారు సత్కరించారు.