ఈ సందర్భంగా కె.యస్. రామారావుగారు మాట్లాడుతూ...సబ్జెక్ట్‌లో ఏదో కొత్తదనం ఉంటే చిన్న సినిమాలు సూపర్ సక్సెస్ అవుతాయనేది అందరికీ తెలిసిందే. ఆ నమ్మకంతోనే నేను కూడా ఈ టీమ్‌తో కలిశాను. శేషు మంచి అనుభవం ఉన్న వ్యక్తి. మా బ్యానర్‌లో క్రిమినల్ దగ్గర నుంచి పని చేశాడు. ఇప్పుడు త్రివిక్రమ్ దగ్గర పనిచేసి వచ్చాడు. శేషు ఎంత కష్టపడి, ప్రేమించి తీశాడో.. సినిమా కూడా అంత బాగా వచ్చింది. చాలా బాగుంది. చాలాకాలం తర్వాత వస్తున్న అందమైన చిన్న సినిమా ఇది. శేషుతో పాటు డీఓపీ రమేష్, మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ చంద్రశేఖర్‌లు చాలా కష్టపడ్డారు. మూజిక్, కంటెంట్, విజువల్‌గా అద్భుతం అనిపించే సినిమా. హీరో, హీరోయిన్ పెయిర్ కూడా చాలా అందంగా ఉంది. తెలుగు, హిందీ, మరాఠీ, తమిళం, కన్నడం, మలయాళం మొత్తం 6 లాంగ్వేజెస్‌లో చేశాం. సినిమా మీద మా నమ్మకానికి ఇదో మంచి ఉదాహరణ. ఈ సినిమాను మీడియా కూడా ప్రోత్సహించాల్సిందిగా కోరుకుంటున్నా అన్నారు.