ఇటీవల కరోనా వైరస్ బారినపడిన నటీమణుల్లో పూజా హెగ్డే ఒకరు. ఈమెకు గత నలె 25వ తేదీన కరోనా పాజిటివ్ అని తేలింది. తమిళ హీరో విజయ్ కొత్త చిత్రం షూటింగ్ కోసం జార్జియా వెళ్లిన చిత్ర బృందంలో పూజా హెగ్డే ఒకరు. అక్కడ నుంచి స్వదేశానికి తిరిగివచ్చిన తర్వాత ఈమెకు కరోనా వైరస్ సోకింది. ఆ వెంటనే స్వీయ నిర్బంధంలోకి వెళ్లిన ఆమె తాజాగా కరోనా నుంచి పూర్తిగా కోలుకుంది.
మరోవైపు, పూజా హెగ్డే చేతిలో ప్రస్తుతం భారీ చిత్రాలే ఉన్నాయి. హీరో ప్రభాస్‌తో కలిసి ఆమె రాధేశ్యామ్‌లో నటించింది. అంతేకాదు.. అక్కినేని అఖిల్‌కు జోడీగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, ఆచార్యలోనూ ఆమె ఒక కీలకపాత్ర పోషించింది.
తమిళ స్టార్ హీరో విజయ్ సరసన మరో నటిస్తోంది. దళపతి 65 వర్కింగ్ టైటిల్‌తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ నెల్సన్ దిలీప్‌కుమార్ తెరకెక్కిస్తున్నారు. ఇలా తెలుగు, తమిళ, హిందీ చిత్రాలతో ఆమె చాలా బిజీగా ఉంది.