''జల్సాలు చూపిస్తూ అజ్ఞాతవాసంలో వేసేస్తాడు జాగ్రత్త .. నమ్మకద్రోహి" అంటూ పూనమ్ కౌర్ చేసిన ట్వీట్ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఆమె తన ట్వీట్‌లో రెండు సినిమా పేర్లను ప్రస్తావనకు తెచ్చారు. ఆ పేర్లను వాడటం ద్వారా ఆ దర్శకుడు పేరును చెప్పకుండా నమ్మకద్రోహి అంటూ చెప్పకనే చెప్పిందా అంటూ చర్చ సాగుతోంది.
అంతేకాకుండా ఆ దర్శకుడు ఆ నాలుగు కుటుంబాలకు దగ్గరగా ఉండటం.. ఎన్నారై హీరోయిన్లకు అవకాశాలు ఇవ్వడం ఆ దర్శకుడికి అలవాటు. నాకు హిట్లు లేవనే సాకులు చెప్పి ఓ ఎన్నారై హీరోయిన్‌కు అవకాశం ఇచ్చాడు. మరి ఆ ఎన్నారై హీరోయిన్‌కు హిట్లు ఉన్నాయా? ఆ ఎన్నారై హీరోయిన్లు మీరు చెప్పిన పనులు బాగా చేస్తారని విన్నాను.. అలాంటి ఉద్యోగాలు చేయకపోవడమే మంచిది అంటూ పూనమ్ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ ఏ వివాదానికి దారితీస్తుందో వేచి చూడాలి.