విడాకులు పొందుతున్న సినీ ప్రముఖుల జాబితా నానాటికీ పెరిగిపోతోంది. ఇందులోభాగంగా, తాజాగా మరో నటి విడాకులు పొందింది. మాలీవుడ్‌కు చెందిన దివ్య ఉన్న భర్త నుంచి విడాకులు పొందినట్టు పేర్కొంది. తాను ఇప్పుడు స్వేచ్ఛా జీవి అయినట్టు పేర్కొంది. దీంతో పెళ్లి తర్వాత ఆపిన నటనను మళ్లీ కొనసాగించాలన్న నిర్ణయానికి వచ్చారట. ప్రస్తుతం ఆ ప్రయత్నంలో ఉన్న దివ్యాఉన్ని కొందరు దర్శకుల వద్ద కథలు వింటున్నారని సమాచారం.
కాగా, ఈమె తన భర్తతో కలిసి 14 ఏళ్ల పాటు వైవాహిక జీవితాన్ని కొనసాగించింది. అయితే, భార్యాభర్తల మధ్య మనస్పర్థలు తలెత్తడంతో విడిపోయారు. తనకు తగ్గ కథ లభిస్తే నటిస్తానంటున్న ఈ మలయాళీ భామ చెల్లెలు విద్యాఉన్నికి కూడా నటనపై మోజు పెరిగిందట. ఆమెను హీరోయిన్‌ను చేసే పనిలో ఉన్నారు దివ్యాఉన్ని. పనిలో పనిగా తన చెల్లెలితో కలిసి నటించాలన్న ఆకాంక్షను వ్యక్తం చేస్తున్నారు. అలాంటి మంచి కథ కుదిరితే ఇద్దరం కలిసి నటించడానికి రెఢీ అంటున్నారు.