నటి, డాక్టర్ ప్రియ గుండెపోటుతో మృతి-8 నెలల గర్భిణి.. ఐసీయూలో పాప!

బుధవారం, 1 నవంబరు 2023 (21:47 IST)
Priya
మలయాళ టెలివిజన్ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. రెంజూషా మీనన్ మరణించిన కొన్ని రోజులకే మరో నటి కన్నుమూసింది. మలయాళ టీవీ నటి డాక్టర్ ప్రియ గుండెపోటుతో కన్నుమూశారు. మరణించే సమయానికి ఆమె 8 నెలల గర్భిణి. 35 ఏళ్ల ప్రియ మంగళవారం రాత్రి ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. 
 
నటి ప్రియ మరణ వార్తను నటుడు సత్య సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. "మలయాళ టెలివిజన్ రంగంలో మరో మరణం. డాక్టర్ ప్రియ గుండెపోటుతో నిన్న మరణించారు. ఆమె 8 నెలల గర్భిణి. పాప ఐసీయూలో ఉంది. ప్రియకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవు. కూతురు ప్రియ మృతిని తట్టుకోలేక ఆమె తల్లి కన్నీరుమున్నీరుగా విలపిస్తూనే ఉంది. ప్రియమైన భర్త చాలా బాధపడుతున్నాడు. ఆరు నెలలుగా ప్రియని చూసుకుంటున్నాడు. గుండె నొప్పి ఆమెను తిరిగి రానిలోకాలకు తీసుకెళ్లింది" అంటూ సత్య ఆవేదన వ్యక్తం చేశాడు.  
 
కరుతముత్తు సీరియల్‌ ద్వారా డాక్టర్ ప్రియ మలయాళంలో బాగా పాపులర్ అయ్యింది. పెళ్లయ్యాక నటనకు విరామం ఇచ్చింది. తిరువనంతపురంలోని పీఆర్‌ఎస్‌ ఆస్పత్రిలో డాక్టర్‌గా పనిచేస్తున్న ఆమె.. ఎండీ కూడా పని చేస్తున్నట్లు తెలుస్తోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు