డాక్టర్ రాజశేఖర్ హీరోగా నటించి తాజాగా రిలీజై మంచి విజయాన్ని నమోదుచేసిన చిత్రం "పీఎస్‌వీ గరుడవేగ". ప్రవీణ్‌సత్తారు దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కగా శ్రద్దాదాస్, పూజాకుమార్ ఇందులో కథానాయికలుగా నటించారు. ఈ మూవీ విడుదలైన అన్ని థియేటర్లలో సక్సెస్‌ఫుల్ టాక్‌తో ప్రదర్శితమవుతూ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.
అయితే, ఈ చిత్రంలో నటించిన ప్రతి ఒక్కరిపై టాలీవుడ్ ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇటీవల ఓటమెరుగని దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి సైతం ఈ చిత్ర బృందంపై ప్రశంసలు కురిపించారుడు. ఇక రీసెంట్‌గా 'బాహుబలి' సినిమాతో ఇండియన్ స్టార్‌గా మారిన బాహుబలి ప్రభాస్ తల్లి గరుడవేగ చిత్ర హీరోయిన్ పూజా కుమార్‌ని అభినందించారట.