యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సాహో సినిమా ఇటీవల రిలీజైన విషయం తెలిసిందే. దర్శకుడు సుజిత్, యు.వి.క్రియేషన్స్ రెండు సంవత్సరాలు ఎంతో కష్టపడి రూపొందించిన ఈ సినిమాకి డివైడ్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్స్ మాత్రం బాగానే రాబడుతుంది. ముఖ్యంగా బాలీవుడ్లో రికార్డు స్ధాయి కలెక్షన్స్ వసూలు చేయడం విశేషం.
రెబల్ స్టార్ సాహో సినిమాతో అమెరికాలో మరోసారి ప్రభాస్ తన బాక్స్ ఆఫీస్ స్టామినా చూపించాడు. యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన సాహో 3 మిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరింది. ఓవర్సీస్‌లో భారీగా విడుదలైన సాహో ప్రీమియర్స్ తోనే సాలీడ్ కలెక్షన్స్‌ని రాబట్టింది. ఇక ప్రభాస్ గత సినిమాలు కూడా యూఎస్‌లో మంచి వసూళ్లను రాబట్టయి.