నాగ చైతన్య ఫస్ట్-లుక్ పోస్టర్ లాంచ్ చేశారు. లీడ్ పెయిర్ రొమాంటిక్ కెమిస్ట్రీని ప్రజెంట్ చేస్తున్న ఈ పోస్టర్ లవ్లీగా వుంది. కిటికీ దగ్గర కూర్చున్న దర్శి, చొక్కా, షార్ట్స్‌లో రిలాక్స్‌గా కనిపిస్తాడు, మగ్ పట్టుకుని ఆనంది వైపు చూస్తున్నాడు. టాప్, డార్క్ ప్యాంటు ధరించి మగ్ పట్టుకొని ఆనంది చిరునవ్వుతో కనిపించింది.
ఈ చిత్రానికి టాప్ టెక్నికల్ టీం వర్క్ చేస్తోంది. 'గామి' చిత్రానికి గద్దర్ అవార్డు అందుకున్న విశ్వనాథ్ రెడ్డి సినిమాటోగ్రఫీని అందిస్తుండగా, బ్లాక్ బస్టర్ 'డ్రాగన్' కు చార్ట్ బస్టర్ మ్యూజిక్ అందించిన లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్నారు. రాఘవేంద్ర తిరున్ ఎడిటర్, అరవింద్ ములే ప్రొడక్షన్ డిజైనర్, కార్తీక్ తుపురాని, రాజ్ కుమార్ సంభాషణలు అందిస్తున్నారు.