తెల్లని మర్చెసా డ్రెస్‌.. రూ.పది కోట్ల విలువైన నగలు... బ్లూఫాక్స్ కేఫ్‌లో...

బుధవారం, 31 అక్టోబరు 2018 (15:04 IST)
బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా త్వరలోనే పెళ్లి పీటలెక్కనుంది. ఇందుకోసం ఏర్పాట్లు భారీ ఎత్తున చేస్తున్నారు. ముఖ్యంగా, ఆమె పెళ్ళి బట్టలతో పాటు.. వజ్రాభరణాలను ఇప్పటికే ఎంపిక చేశారు. వీటిని ధరించిన ప్రియాంకా చోప్రా పెళ్లి కుమార్తె అయింది. 
 
న్యూయార్క్‌లోని టిఫానీ బ్లూఫాక్స్ కేఫ్‌లో జరిగిన ఈవెంట్‌లో ఆమె ఓ తెల్లని మర్చెసా డ్రెస్‌లో మెరిసిపోయింది. అయితే ఆమె పెళ్లి కూతురైన వార్త కంటే ఆ ఈవెంట్‌లో ప్రియాంకా పెట్టుకున్న నగలు ప్రముఖంగా వార్తల్లో నిలిచాయి. సుమారు రూ.7.50 కోట్ల విలువైన టిఫానీ అండ్ కో జువెలరీని ప్రియాంకా ధరించడం విశేషం. 
 
దీనికి తన బోయ్‌ఫ్రెండ్ నిక్ జొనాస్ పెట్టిన రూ.2.1 కోట్ల విలువైన ఎంగేజ్‌మెంట్ రింగ్ అదనం. అంటే మొత్తంగా ఈ ఈవెంట్‌లో ప్రియాంకా సుమారు రూ.9.5 కోట్ల విలువైన నగలు ధరించింది. 
 
టిఫానీస్ జువెలరీ అంటే ప్రియాంకాకు ఎంతో ఇష్టం కావడంతో లండన్‌లోని ఆ స్టోర్‌ను కాసేపు మూసేసి మరీ పూర్తి ప్రైవసీ మధ్య నిక్ తమ ఎంగేజ్‌మెంట్ రింగ్‌ను సెలక్ట్ చేశాడు. ఇక ఈ ఈవెంట్‌లో ఆమె వేసుకున్న వైట్ కలర్ డ్రెస్ ఖరీదు రూ.4.4 లక్షల కావడం మరో విశేషం. 
 
ఈ ఈవెంట్‌కు ప్రియాంకా సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. ప్రియాంకా, నిక్ తమ పెళ్లి తేదీని ఇంకా ప్రకటించకపోయినా.. డిసెంబర్‌లో జోధ్‌పూర్‌లోని ఓ ప్యాలస్‌లో మూడు రోజుల పాటు ఈ వేడుక జరుగనుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు