సుష్మిత కొణిదెల నిర్మిస్తున్న శ్రీదేవి శోభన్ బాబు టీజర్ ఆవిష్కరించిన సమంత
గురువారం, 7 ఏప్రియల్ 2022 (13:20 IST)
Santosh Shobhan, Gauri G Kishan, Sushmitha Konidela, , Sidhu Jonnalingada
సంతోష్ శోభన్, గౌరి జి కిషన్ హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం శ్రీదేవి శోభన్ బాబు. గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వంలో విష్ణు ప్రసాద్, సుష్మిత కొణిదెల నిర్మాతలుగా రూపొందుతోన్న ఈ సినిమా టీజర్‌ను స్టార్ హీరోయిన్ సమంత విడుదల చేసి చిత్ర యూనిట్‌కి అభినందనలు తెలియజేసింది.
టీజర్‌ను గమనిస్తే..
సంతోష్ శోభన్ .. శోభన్ పాత్రలో, గౌరి జి కిషన్.. శ్రీదేవి పాత్రలో నటించారు. ఈ రెండు పాత్రలు ఓ ఇంటి విషయంలో సదరు ఇల్లు నాదంటే నాదేనని గొడవ పడతారని అర్థమవుతుంది. టీజర్‌లో పాత్రలను రేడియో వార్తలను చదువుతున్న కోణంలో పరిచయం చేస్తూ వచ్చారు. ఇది కాస్త డిఫరెంట్‌గా ఉంది. అసలు శ్రీదేవి - శోభన్‌బాబు మధ్య గొడవ ఇంటి గురించేనా! మరి ఇంకేదైనా ఉందా! అనేది తెలియాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే..
ఈ సందర్భంగా నిర్మాత సుష్మిత కొణిదెల మాట్లాడుతూ ``మా సంస్థకు శ్రీదేవి శోభన్‌బాబు సినిమా చాలా స్పెషల్. ఇంటి పక్కన ఓ కాఫీ షాప్‌లో ఈ కథ మొదలైంది. అక్కడే డైరక్టర్ ప్రశాంత్‌గారిని కలిశాను. అందరం కలిసి ఫ్యామిలీ వెకేషన్‌కి వెళ్లినట్టు వెళ్లి షూటింగ్ చేసుకుని వచ్చాం. మా నాన్నగారికి ఫస్ట్ సినిమా ఒక ఆఫర్‌లాగా వచ్చి, ఆయన్ని ఈ స్టేజ్‌కి తీసుకొచ్చింది. అలాంటి ఆపర్‌చ్యూనిటీ నాకు శ్రీదేవి శోభన్‌బాబు. మీ అందరి సపోర్ట్, బ్లెస్సింగ్స్, కో ఆపరేషన్ కావాలి. త్వరలోనే సినిమా విడుదల చేస్తాం. కమ్రన్ సంగీతం బాగా కుదిరింది. లీడ్ పెయిర్ మధ్య క్యూట్ ఎమోషన్స్ బాగా కుదిరాయి. సిద్ధు మా ఫంక్షన్‌కి రావడం ఆనందంగా ఉంది. మా బాబాయ్ నాగబాబుగారు స్పెషల్ రోల్ చేశారు. రోహిణిగారు కూడా ప్రత్యేక పాత్ర చేశారు`` అని అన్నారు.
హీరో సంతోష్ శోభన్ మాట్లాడుతూ ``టాలెంట్‌కి మించింది ఎప్పుడైనా అవకాశమే అని నమ్ముతాను. ఈ అవకాశం ఇచ్చిన నిర్మాతలకు ధన్యవాదాలు. సిద్ధు మా ఫంక్షన్‌కి రావడం ఆనందంగా ఉంది. ఆయన చాలా టాలెంటెడ్ వ్యక్తి. ప్రశాంత్ నాకు మంచి ఫ్రెండ్. ఎక్స్ ట్రీమ్లీ టాలెంటెడ్. చాలా పెద్ద డైరక్టర్ అవుతారు. గౌరీ ఈ సినిమాలో చాలా కొత్తగా కనిపిస్తారు`` అని చెప్పారు.
హీరోయిన్ గౌరి జి కిషన్ మాట్లాడుతూ ``ఫస్ట్ ఫుల్‌ప్లెడ్జ్ డ్ హీరోయిన్‌గా ఈ సినిమాలో చేశాను. జానులో నటించడం బ్లెస్సింగ్. ఇండస్ట్రీలో నాకు ఐడెంటిటీ ఇచ్చిన సినిమా. ఈ సినిమాలో శ్రీదేవి కేరక్టర్ చేశాను. నాకు టీమ్ సూపర్‌గా సపోర్ట్ చేశారు. నిర్మాతలకు ధన్యవాదాలు. టీజర్ చాలా బావుంది. సంతోష్ నాకు కో యాక్టర్‌గా కన్నా ఫ్రెండ్‌గా ఉన్నారు. ఆద్యంతం ఎంటర్‌టైన్ చేసే సినిమా ఇది`` అని అన్నారు.
సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడుతూ ``సుష్మితగారు, విష్ణుగారు చేస్తున్న తొలి సినిమా వేదిక మీద నేనుండటం ఆనందంగా ఉంది. టీమ్ అందరికీ కంగ్రాజులేషన్స్, ఈ సినిమాకు కాస్ట్యూమ్ డిజైన్ కూడా సుష్మితగారే చేశారు. ఈ సినిమాకు టీమ్ అంతా కష్టపడి చేశారని అర్థమైంది. టీజర్ చాలా క్యూట్‌గా ఉంది. సంతోష్ చాలా బావున్నాడు. గౌరీ చాలా కొత్తగా కనిపించారు`` అని అన్నారు.
మ్యూజిక్ డైరక్టర్ కమ్రాన్ మాట్లాడుతూ ``ప్లే బ్యాక్ అనే సినిమాకు బ్యాక్ గ్రౌండ్ చేశాను. ఆ తర్వాత నిర్మాణ సంస్థ గోల్డ్ బాక్స్ నుంచి ఫోన్ వచ్చింది. వారం తర్వాత దర్శకుడు ప్రశాంత్ కథ చెప్పారు. అవకాశానికి ధన్యవాదాలు`` అని అన్నారు.
నిర్మాత విష్ణు ప్రసాద్ మాట్లాడుతూ ``ప్రశాంత్ చాలా మంచి కథ చెప్పారు. ఎంటర్‌టైనింగ్, ఫ్యామిలీ సినిమా అవుతుంది. రెండు గంటలు వినోదాన్ని పంచుతుంది. త్వరలోనే మళ్లీ కలుస్తాం`` అని చెప్పారు.
దర్శకుడు ప్రశాంత్ కుమార్ దిమ్మల మాట్లాడుతూ ``అందరికీ టీజర్ నచ్చిందనుకుంటా. సినిమా చాలా బాగా వచ్చింది. సినిమా చూసి అందరూ ఎంజాయ్ చేస్తారు. నా హీరో సంతోష్ శోభన్‌కి, మా నిర్మాతలకి ధన్యవాదాలు. సంతోష్ ఎప్పటినుంచో నాకు మంచి ఫ్రెండ్. ఏ కథయినా ముందు నేను తనకే చెప్తాను`` అని అన్నారు.