''వైఎస్ జగన్ కేర్స్'' అదుర్స్.. డాషింగ్ డైరక్టర్ పూరీ జగన్నాథ్

గురువారం, 2 జులై 2020 (11:27 IST)
డాక్టర్స్ డే సందర్భంగా ''వైఎస్ జగన్ కేర్స్'' పేరిట ప్రారంభించిన ఈ కార్యక్రమంపై డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ స్పందించాడు. దేశ వ్యాప్తంగా అంతా కరోనా కోసం తీవ్రంగా పోరాడుతున్న సమయంలో అత్యవసర పరిస్థితి కోసం అంబులెన్స్ సర్వీసులు ప్రారంభించడం గొప్ప విషయమని కితాబిచ్చాడు.

అత్యవసర పరిస్థితులు, ప్రమాదాలు, విపత్తుల్లో పట్టణ గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు వైద్య సేవలు అందించడానికి '108,104' అంబులెన్స్‌ల సముదాయాన్ని ఏర్పాటు చేసిన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి హ్యాట్సాఫ్ అంటూ పూరీ ట్వీట్ చేశాడు.
 
ఏపీలోని గ్రామాలు, పట్టణాల్లోని ప్రజలందరికీ క్షణాల్లో వైద్య సదుపాయం అందించేందుకు నేడు 1088 అంబులెన్స్‌లో ఏకకాలంలో ప్రారంభించారు. వీటితో ఏ ఒక్కరూ కూడా అత్యవసర చికిత్స అందకుండా ప్రాణాలు కోల్పోకుండా కాపాడవచ్చు. వైఎస్ జగన్ కేర్స్ పేరిట ఈ కార్యక్రమం సోషల్ మీడియాలో దేశ వ్యాప్తంగా ట్రెండ్ అవుతోంది.

అత్యవసర చికిత్సను అందించడానికి ఏపీ ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమంపై సినీ ప్రముఖులు సైతం స్పందించారు. ఈ జాబితాలో పూరీ జగన్నాథ్ కూడా చేరిపోయాడు. 
 
మరోవైపు రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ మొదటిసారి డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌తో కలిసి ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై మాస్ ఆడియెన్స్ లో అంచనాలు భారీగానే ఉన్నాయి. అయితే దర్శకుడు పూరి సినిమాను ఇదే ఏడాది ప్రేక్షకుల ముందుకు తేవాలని ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు.

కానీ ఊహించని విధంగా ప్లాన్స్ మొత్తం చేంజ్ అయ్యాయి. అసలే సినిమా కాస్త ఆలస్యంగా స్టార్ట్ అయ్యిందని బాధపడిన పూరి జగన్నాథ్‌కి లాక్ డౌన్ కూడా మరొక దెబ్బ కొట్టింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు