Y.Ravishankar, Naveen Yerneni, CEO Cherry
అటవీ నేపథ్యంలో ఫారెస్ట్ అధికారులు కూడా ఎక్కువగా వెళ్ళని ప్రాంతాల్లో రిక్కీ చేసి షూటింగ్ చేసిన సినిమా `పుష్ప`. ఒక్కోసారి లోపలికి వెళ్ళాలంటే గంటలపాటు ప్రయాణం, అల్లు అర్జున్ పాత్ర కోసం రెండు గంటల మేకప్ వేయాలి. తిరిగి వచ్చాక దాన్ని తీయడానికి గంటకుపైగా పడుతుంది. ఇక లొకేషన్లలో వాతావరణ అనుకూలంగా లేకపోతే యూనిట్ అంతా కష్టమైనా ఇష్టంగా పనిచేసి విడుదలకు సిద్ధం చేశామని చిత్ర నిర్మాతలు మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు పుష్ప నిర్మాతలు నవీన్ యెర్నేని, వై.రవిశంకర్, సీఇవో చిరంజీవి చెర్రీ తెలియజేస్తున్నారు.