రాయలసీమ అంటే ఏంటో రాచరికం సినిమా చూపిస్తుంది

డీవీ

సోమవారం, 27 జనవరి 2025 (16:09 IST)
Apsara Rani, Vijay Shankar, Varun Sandesh, Eshwar, Vengi
అప్సరా రాణి, విజయ్ శంకర్, వరుణ్ సందేశ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘రాచరికం’. ఈశ్వర్ నిర్మాతగా చిల్ బ్రోస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ మూవీని నిర్మించారు. సురేశ్ లంకలపల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ చేసిన కంటెంట్, పాటలు, పోస్టర్లు, టీజర్, ట్రైలర్ అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ మూవీని జనవరి 31న గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నారు.
 
హీరో విజయ్ శంకర్ మాట్లాడుతూ.. ‘‘రాచరికం’ టైటిల్లోనే ఓ రాయల్టి ఉంటుంది. ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూపిస్తామా? అని అంతా ఆత్రుతగా ఎదురుచూస్తున్నాం. సురేష్ పనితనం, డెడికేషన్ ప్రతీ షాట్‌లో కనిపిస్తుంది. నా బ్రదర్ మన్మథరావు సపోర్ట్ వల్లే నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాను. ఈ సినిమాను గొప్పగా తీయాలని ఈశ్వర్ గారు అహర్నిశలు కష్టపడ్డారు. రాయలసీమ అంటే ఏంటో ఈ సినిమా చూపిస్తుంది. ఇంత పెద్ద పాత్రను నాకు ఇచ్చిన దర్శకుడు సురేష్ కి థాంక్స్. మా డీఓపీ బాలీవుడ్‌లో బిజీగా ఉన్నా కూడా మాకోసం వచ్చారు. మ్యూజిక్ డైరెక్టర్ వెంగి ఇచ్చిన పాటలు, ఆర్ఆర్ ఇంకా మైండ్‌లోనే తిరుగుతున్నాయి.  రామ్ ప్రసాద్ రాసిన డైలాగ్స్ గూస్ బంప్స్ తెప్పిస్తాయి అని అన్నారు.
 
వరుణ్ సందేశ్ మాట్లాడుతూ..  ‘రాచరికం సినిమాలో నెగెటివ్ పాత్రను చేశాను. మైఖేల్ తరువాత మళ్లీ ఈ పాత్ర నన్ను ఎగ్జైట్ చేసింది. అందుకే ఈ సినిమాలో నటించాను. సురేశ్ మరియు ఈశ్వర్ అద్భుతంగా తీశారు. అప్సరా, విజయ్ కెమిస్ట్రీ బాగుంది. మ్యూజిక్ బాగుంది. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. జనవరి 31న ఈ చిత్రం రాబోతోంది. అందరూ చూసి సపోర్ట్ చేయండి’ అని అన్నారు.
 
దర్శకుడు సురేశ్ లంకలపల్లి మాట్లాడుతూ.. ‘రాచరికం సినిమాకు నా టీం ఎంతో సహకరించింది. వంద కోట్లతో తీసిన సినిమాలా కనిపిస్తుంది. రామ్ ప్రసాద్ రాసిన డైలాగ్స్ అద్భుతంగా ఉంటాయి. ఎడిటర్ జేపీగారు సినిమాను అద్భుతంగా కట్ చేశారు. కథ రాసినప్పటి నుంచి ఈశ్వర్ నాతోపాటున్నారు. ఎవరి కోసమో ఎదురుచూడటం ఎందుకు మనమే నిర్మిద్దామని ఈశ్వర్ ముందుకు వచ్చారు. విజయ్ గారు చాలా డెడికేటెడ్‌గా నటించారు. అప్సరా రాణి గారు మాత్రమే ఈ పాత్రను చేయాలని ముందే ఫిక్స్ అయ్యాను.  ఆమె అద్భుతంగా నటించారు. విజయ రామరాజు విలనిజం చూసి అంతా షాక్ అవుతారు. వరుణ్ సందేశ్ కారెక్టర్ అదిరిపోతుంది అని అన్నారు.
 
నిర్మాత ఈశ్వర్ మాట్లాడుతూ.. బడ్జెట్ పెరిగిపోతోన్న ప్రతీ సారి నా స్నేహితులే నాకు సపోర్ట్‌గా నిలిచారు. మన ప్రయత్నాల్ని మధ్యలో ఆపేయకూడదు. చివరి వరకు ప్రయత్నిస్తూనే ఉండాలి. సురేష్, నేను, చాణక్య కలిసి కష్టపడి ఇక్కడకు వచ్చాం. విజయ్ శంకర్ ఎంతో ఒదిగి ఉంటాడు. అప్సరా అద్భుతంగా నటించారు. విజయరామరాజు పర్ఫామెన్స్ చూసి షాక్ అవుతారు. వరుణ్ సందేశ్ చాలా సపోర్ట్ చేశారు అని అన్నారు.
 
అప్సరా రాణి మాట్లాడుతూ, విజయ్ శంకర్‌తో నటించడం ఆనందంగా ఉంది. సురేశ్ గారు ఈ మూవీని అద్భుతంగా తెరకెక్కించారు. ఈ చిత్రం చాలా బాగా వచ్చింది. ఈ మూవీ అందరికీ నచ్చుతుంది. జనవరి 31న మా సినిమాను అందరూ చూడండి’ అని అన్నారు.
 
 మ్యూజిక్ డైరెక్టర్ వెంగి మాట్లాడుతూ.. ‘రాచరికం సినిమాలోని పాటలు చాలా బాగా వచ్చాయి. ఐపీఎల్ మూవీకి సురేశ్ గారితో పని చేశాను. ఈ మూవీని చాలా రిచ్‌గా తీశారు. నిర్మాత చాలా ఖర్చు పెట్టారు. విజయ్ శంకర్, అప్సరా రాణి, వరుణ్ సందేశ్ ఇలా అందరూ అద్భుతంగా నటించారు. విజువల్స్ నెక్ట్స్ లెవెల్లో ఉంటాయి. ఆర్టిస్టుల పర్ఫామెన్స్, కెమెరా వర్క్‌‌కి తగ్గట్టుగా నేను మ్యూజిక్ ఇచ్చాను. ఈ చిత్రం పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
 
 ప్రాచీ థాకర్ మాట్లాడుతూ.. ‘రాచరికం సినిమాలో నాకు మంచి పాత్రను ఇచ్చిన దర్శకుడు సురేశ్, నిర్మాత ఈశ్వర్ గారికి థాంక్స్. విజయ్ శంకర్, అప్సరా, ప్రీతి ఇలా అందరితో కలిసి నటించడం ఆనందంగా ఉంది. జనవరి 31న ఈ చిత్రం రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు