''కబాలి'' సినిమాలో రజనీకాంత్ పక్కన మెరిసిన రాధికా ఆప్టే బుధవారం పుట్టినరోజు జరుపుకుంది. రాధికా ఆప్టే సొంతూరు పుణె. నాటకరంగమంటే ప్రాణం. అక్కడి నుంచే సినిమాల వైపు అడుగేశారు. కథక్ నేర్చుకున్నారు. మార్షల్ ఆర్ట్స్‌లోనూ ప్రావీణ్యం ఉంది. తెలుగులో రక్తచరిత్ర, ధోని, లెజెండ్, లయన్ సినిమాల్లో నటించిన రాధికా ఆప్టే.. దక్షిణాది, ఉత్తరాది సినిమాలతో పాటు హాలీవుడ్ సినిమాల్లోనూ తళుక్కుమంది.
రాధికకు లండన్‌కు చెందిన సంగీత కళాకారుడు బెనెడిక్ట్ టేలర్‌తో వివాహమైంది. కెమెరా ముందు నిలబడాలి, అది ఏ స్థాయి సినిమా అన్నది ముఖ్యం కాదని రాధికా చెప్తోంది. అయితే రాధిక తాజా సినిమాలో కొన్ని శృంగార సన్నివేశాలకు సంబంధించిన వీడియో లీక్‌పై ఒక్క మాట కూడా మాట్లాడలేదు. దానికి కారణం ఆ సినిమా దర్శకనిర్మాతలు ముందుగానే ఆమెకు ఈ విషయం చెప్పి మాట్లాడకుండా ఉండడానికి కొంత సొమ్ము ముట్టజెప్పారట.