అందులో భాగంగానే ఇప్పుడు రెయిన్‌బో చిల్డ్రన్స్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్ (RCHI)తో కలిసి పిల్లల గుండె సంరక్షణ కోసం ప్యూర్ లిటిల్ హార్ట్స్ ఫౌండేషన్ (PLHF)ని ప్రారంభించారు. పుట్టుకతో వచ్చే గుండె జబ్బుల తీవ్రత దృష్ట్యా, 2 లక్షల మంది పిల్లలు దానితో బాధపడుతున్నారు. ఆర్థికంగా వెనుకబడి ఉన్న పిల్లలకు ఈ ప్రత్యేక కార్యక్రమం కింద చికిత్స అందిస్తున్నారు.
ఈ సందర్భంగా మహేష్‌బాబు మాట్లాడుతూ, రెయిన్‌తో కలిసి గుండె శస్త్రచికిత్సలలో పాలుపంచుకోవడం ఆనందంగా వుంది. లోపల ఆపరేషన్ విభాగాలను చూశాను. ఇండియాలోనే గొప్ప ఆసుపత్రిగా చెప్పవచ్చు. బెస్ట్ కార్డియాక్ సర్జన్స్ వున్నారు. దినేష్, డా.రమేష్ వున్నారు. నా కొడుకు గౌతమ్‌తోపాటు నన్ను కేర్ తీసుకుంటున్నారు. పిల్లలనేది నాకు చాలా ఎమోషనల్. మహేస్‌బాబు పౌండేషన్ అసోసియేట్ కావడం ఆనందంగా ఉంది. 125 పిల్లలకు హార్ట్ ఆపరేషన్‌లు చేయబోతున్నారు. చైర్మన్ సి.ఎస్. రెడ్డిగారికి ధన్యవాదాలు అన్నారు.