ఈ సందర్భంగా నిర్మాత రామబ్రహ్మం సుంకర మాట్లాడుతూ '2016లో హిట్ అయిన చిత్రాల్లో `ఈడోరకం-ఆడోరకం` తర్వాత ఎ.కె.ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌లో రాజ్‌తరుణ్ నటిస్తున్న మరో చిత్రం 'కిట్టు ఉన్నాడు జాగ్రత్త'. హిలేరియస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యు/ఏ సర్టిఫికేట్‌ను పొందింది. సినిమాను ప్రపంచ వ్యాప్తంగా మార్చి 3వ తేదీన గ్రాండ్ లెవల్లో విడుదల చేస్తున్నాం. ఇప్పటివరకు రాజ్‌తరుణ్ చేయని విభిన్న పాత్రలో నటించాడని చెప్పారు.
అలాగే, అనేక మలుపులతో, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో ఉన్న ఈ సినిమా ట్రైలర్‌తో పాటు పాటలను కూడా రిలీజ్ చేశాం. హంసనందిని నటించిన స్పెషల్ సాంగ్ `నా పేరే సింగపూర్ సిరిమల్లి..` సాంగ్‌ను సోమవారమే రిలీజ్ చేశాం. ప్రతి పాటలకు ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తోంది. మ్యూజిక్ చార్ట్స్‌లో ముందు వరుసలో ఉంది. సాయిమాధవ్ సంభాషణలు, రాజశేఖర్ సినిమాటోగ్రఫీ, ఎం.ఆర్.వర్మ ఆర్ట్ వర్క్ సినిమాకు ప్లస్ కానున్నాయి. రాజ్‌తరుణ్ సరసన అను ఇమ్మాన్యుయల్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్‌ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్ ఈ చిత్రంలో నటించారు' అని వివరించారు.
అను ఇమ్మాన్యుయల్, నాగబాబు, పృథ్వీ, రఘుబాబు, రాజా రవీంద్ర, తాగుబోతు రమేష్, ప్రవీణ్, సుదర్శన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ : శ్రీకాంత్ విస్సా, డైలాగ్స్ : సాయిమాధవ్ బుర్రా, ఎడిటర్ : ఎం.ఆర్.వర్మ, ఆర్ట్ : అవినాష్, కెమెరా : బి.రాజశేఖర్, సహ నిర్మాత : అజయ్ సుంకర, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : కిషోర్ గరికపాటి, మ్యూజిక్ : అనూప్ రూబెన్స్, నిర్మాత : రామబ్రహ్మం సుంకర, దర్శకత్వం : వంశీకృష్ణ.