రాజమౌళి బాటలో తనయుడు.. త్వరలో దర్శకత్వ బాధ్యతలు

శుక్రవారం, 25 నవంబరు 2016 (17:08 IST)
'బాహుబలి'తో.. అంతర్జాతీయ గుర్తింపు పొందిన దర్శకుడిగా పేరుపొందిన రాజమౌళి.. తన శిష్యుల్ని కొందరిని తయారు చేసుకున్నాడు. ముగ్గురు దర్శకులుగా పరిచయమైనా వారి సినిమాలు పెద్దగా హిట్‌ కాలేకపోయాయి. కాగా, ఆయన శిష్యుల్లో కుమారుడు ఎస్‌ఎస్‌ కార్తికేయ కూడా ఉన్నాడు. స్క్రీన్‌ప్లేతోపాటు.. తను గ్రాఫిక్స్‌, విజువల్స్‌లో పట్టువున్న వ్యక్తి. టెక్నికల్‌గా తండ్రి చెప్పినట్లు చేయడమేకాకుండా తనకంటూ ప్రత్యేకమైన ఆలోచనల్ని ఆయన ముందుంచుతాడు. అలాంటిదే.. విజ్జువల్‌ ఎఫెక్ట్‌తో 3డి రూపంలో వచ్చిన బాహుబలి మేకింగ్‌.. దీన్ని కొంత పార్ట్‌ను ప్రత్యేకమైన కళ్ళజోళ్లతో చూస్తే ప్రేక్షకుడే.. బాహుబలిగా ఫీలయ్యే అవకాశం వుంది. 
 
ఈ థ్రిల్స్‌ను తనటీమ్‌తో కార్తికేయ ప్రత్యేకంగా తర్ఫీదు తీసుకుని తయారుచేశాడు. కాగా, కార్తీకేయ.. దర్శకుడిగా మారతాడని అనుకుంటున్నారు. కానీ... తను నటుడిగాకూడా మారవచ్చని చిత్ర యూనిట్‌ చెబుతోంది. కథానాయకుడి ఫీచర్స్‌ వున్న తనను నటుడ్ని చేయాలని రాజమౌళికి లేకపోయినా.. కార్తీకేయకు నటుడి అవ్వాలనుందని త్వరలో అందుకు కార్యరూపం దాల్చనున్నందని ఫిలింనగర్‌లో కథనాలు విన్పిస్తున్నాయి. కానీ చాలామటుకు తను దర్శకత్వం వైపు శ్రద్ద పెడతాడనీ.. తెలిసిన సాంకేతికతో మరింత ముందుకు సాగుతాదని కూడా చెప్పుకుంటున్నారు. మరి ఏమవుతాడనేది బాహుబలి-2 తర్వాత కార్తీకేయ చెప్పనట్లు సమాచారం.

వెబ్దునియా పై చదవండి