కబాలి టీమ్‌తో కష్టం అనిపించలేదు.. రజినీ సార్ చాలా సింపుల్.. మైండ్ బ్లాంక్!!

బుధవారం, 25 మే 2016 (11:56 IST)
దక్షిణాది సినిమాల్లో హీరోలకు ఇచ్చే ప్రాధాన్యత హీరోయిన్లకు ఇవ్వరని.. ఇకపై దక్షిణాది సినిమాల్లో నటించేది లేదని చెప్పేసిన రాధికా ఆప్టే తమిళ సూపర్ స్టార్ రజినీ కాంత్ కబాలి సినిమాలో ఛాన్స్ వచ్చేసరికి ఎగురుంటూ వచ్చేసింది. ఆయన చాలా సింపుల్‌గా ఉంటారని.. రజనీ సార్ సెట్లో వుండే తీరు చూస్తే మైండ్ బ్లాంక్‌కాక తప్పదని చెప్పింది. 
 
కబాలి టీమ్‌తో తనకు ఎలాంటి ఇబ్బంది రాలేదని, రజినీతో పాటు అందరూ తనకు బాగా సహకరిస్తున్నారని.. రజినీకాంత్ లాంటి సింప్లిసిటీ ఉన్న హీరోను ఇంకెక్కడా చూడలేదని పొగిడేసింది. తొలిసారి రజినీ సార్‌ను కలిసేందుకు వెళ్ళినప్పుడు ఆయన తనను పలకరించేందుకు గుమ్మం దగ్గరి నిలబడి వున్నారని.. ఆ విషయాన్ని ఇప్పటికీ నమ్మలేక పోతున్నానని వెల్లడించింది. 
 
రజినీ సార్ సింపుల్‌గా ఉంటారని తెలుసు కానీ.. మరి ఇంత సింపుల్ అనుకోలేదు. అంతేగాకుండా అలాంటి క్రమశిక్షణ వున్న నటుడిని ఎక్కడా చూడలేదని చెప్పింది. విరామం లేకుండా రజినీకాంత్ షూటింగ్‌లో పాల్గొన్నారని రాధికా ఆప్టే తెలిపింది. 

వెబ్దునియా పై చదవండి