అందం గురించి ప్రకాష్ రాజ్ ఓ చిక్కు ప్రశ్నను ముందు వేసుకుని మాట్లాడారు. టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు, దక్షిణాది సూపర్ స్టార్ రజినీకాంత్ ఇద్దరిలో ఎవరిది అందం అంటారు అని ప్రశ్నించారు. ఆ ప్రశ్నకు ఆయనే సమాధానం కూడా చెప్పారు.
అదేంటయా అంటే... మనిషికి ముక్కు, చెవులు, నోరు ఇలా అన్నీ ఉంటాయనీ, ఐతే ఒక్కొక్కరు చాలా అందంగా కనిపిస్తారన్నారు. దానికి కారణం వారిలోని ఆత్మవిశ్వాసమేనని చెప్పుకొచ్చారు. మహేష్ బాబు, రజినీకాంత్ ఇద్దరిలో ఉండే ఆత్మవిశ్వాసమే వారిని అందగాళ్లుగా చూపిస్తుందని చెప్పుకొచ్చారు. ఇక తన వ్యవహారానికి వస్తే తనకు ముక్కోపం ఎక్కువనీ, మొదట్లో చాలా ఎక్కువగా ఉండేదన్నారు. ఐనా మనిషన్నాక కోపం సహజమే కదా అని చెప్పారు.