తన ఇద్దరు కుమార్తెల వ్యక్తిగత జీవితాలపై తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. వారిద్దరూ జీవితంలో సంతోషంగా ఉందని, పైగా, వారికి నచ్చిన విధంగా ఉంటూ జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారంటూ ఆయన వ్యాఖ్యానించారు.
ఈ నేపథ్యంలో తన జీవిత భాగస్వామి లతా రజనీకాంత్, ఇద్దరు కుమార్తెలు ఐశ్వర్యల, సౌందర్యల గురించి రజనీకాంత్ తన మనసులోని మాటను వెల్లడించారు. తన జీవితంలో తన భార్య చాలా కీలకమైన పాత్ర పోషించారన్నారు. లత ఓ స్నేహితురాలిలా వెన్నంటే ఉన్నారని చెప్పారు.
ముఖ్యంగా, పిల్లల బాధ్యతలు, ఇంటి పనులు మొత్తం ఆమే చూసుకుంటుంది. ఓ స్నేహితురాలిలా నాకు సహాయం చేస్తుంది. కొన్నిసార్లు తత్వవేత్తలా సూచనలు ఇస్తుంటుందని చెప్పారు. అలాగే, తన ఇద్దరు కుమార్తెలు ఐశ్వర్య ధనుష్, సౌందర్యల గురించి స్పందిస్తూ, 'వారిద్దరు సంతోషంగా ఉన్నారు. జీవితంలో వారికి నచ్చిన విధంగా ఉంటూ.. ఎంజాయ్ చేస్తున్నారు' అని తెలిపారు.
ఇదిలావుండగా, రజనీకాంత్ నటిస్తున్న కొత్త చిత్రం పేట. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో సిమ్రాన్, త్రిషలు హీరోయిన్లు. విజయ్ సేతుపతి, బాబిసింహా, శివకుమారు, సీనియర్ దర్శకుడు మహేంద్రన్ వంటి పెద్ద తారాగణంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కాగా, ఈ చిత్రం సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకురానుంది.