ఆమెకు రజినీకాంత్‌తో మాట్లాడితే తెలియని విషయాలేవీ లేవనిపిస్తుందట

బుధవారం, 27 ఏప్రియల్ 2016 (20:38 IST)
రజనీకాంత్‌ అంటే ఎవరికిష్టం వుండదు. ఆయన్ను చూసి చాలా నేర్చుకోవాలంటుంది నటి రాధికా ఆప్టే. తమిళ సినిమా 'కబాలి'లో ఆమె నటిస్తుంది. రజనీకాంత్‌ కాంబినేషన్‌లో సీన్లు వున్నాయి. ఆయన్ను చాలా దగ్గరగా చూసే అవకాశం కల్గింది. ఆయన చాలా ఇన్‌స్పైరింగ్‌గా వుంటారు. తెలియని విషయాలంటూ ఏమీ లేవేమో అనిపిస్తుంది. ఆయనతో కాసేపు మాట్లాడితే. 
 
చాలా సాఫ్ట్‌గా వుంటారు. ఒకరకంగా నా జీవితంలో మరలా ఇలాంటి వ్యక్తితో కలిసి నటించే ఛాన్స్‌ రాదని చెబుతోంది. పవన్‌ క్రిపాలాని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం రియల్‌ డాన్‌గా రజనీ నటిస్తున్నాడు. ఆయన భార్యగా రాధిక నటిస్తోంది. ఇటీవలే మలేషియాలో ఫైనల్‌ షెడ్యూల్‌ జరిగింది. ప్రస్తుతం డబ్బింగ్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాగా, రాధిక 'ఫోబియా' అనే హిందీ సినిమాలో నటిస్తోంది. ఇది సైకలాజికల్‌ థ్రిల్లర్‌ సినిమా.

వెబ్దునియా పై చదవండి