కబాలి చిత్ర మొదటి షో అమెరికాలో ప్రదర్శనకు సిద్ధం అవుతోంది. సూపర్‌స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం కబాలి. పా రంజిత్ దర్శకత్వంలో నిర్మాత కలైపులి ఎస్.థాను నిర్మించిన ఈ చిత్రంలో రాధిక ఆప్టే హీరోయిన్‌గా నటిస్తుంది. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన చిత్ర టీజర్, పాటలు ప్రేక్షకుల మన్ననలను పొందింది. కాగా చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఈ నెల 22న విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే.
ఇంకో విశేషం ఏమిటంటే ఈ చిత్రం ఇండియాలో కంటే ముందుగానే అమెరికాలో విడుదల కానుంది. ఒక్క అమెరికాలోనే ఈ సినిమాను 400 థియేటర్లలో విడుదల చేస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ, మలయాళంలో విడుదలవుతున్న ఈ చిత్రాన్ని ఇండోనేషియా, చైనా, థాయ్‌లాండ్, జపాన్ భాషల్లోనూ అనువదించి సెప్టెంబర్‌లో విడుదలకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా కోసం రజనీ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.