చెర్రీ నయా చిత్రంలో ఐటమ్ గర్ల్‌గా టాలీవుడ్ హీరోయిన్.. ఎవరు?

సోమవారం, 25 జూన్ 2018 (15:09 IST)
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ - బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇందులో టాలీవుడ్ హీరోయిన్ ఐటమ్ గర్ల్‌గా కనువిందుచేయనుంది. ఆ హీరోయిన్ ఎవరో కాదు రకుల్ ప్రీత్ సింగ్.
 
నిజానికి అగ్రహీరోయిన్లు ప్రత్యేక పాటల్లో మెరవడం ఇప్పుడు చాలా కామనైపోయింది. బాలీవుడ్‌లో కత్రీనా కైఫ్‌, కరీనా కపూర్‌, ఐశ్వర్యరారు, తెలుగులో కాజల్‌, తమన్నా, అనుష్క వంటి హీరోయిన్లు అవకాశం వచ్చినపుడల్లా ప్రత్యేక పాటల్లో నటిస్తూ ప్రేక్షకులను ఆలరిస్తున్నారు. 
 
ఈ కోవలో రకుల్‌ ప్రీత్‌సింగ్‌ కూడా చేరిపోయారు. డి.వి.వి దానయ్య నిర్మించే ఈ చిత్రంలో రకుల్ చెర్రీతో కలిసి కాలుకదపనుంది. ఈ చిత్రంలో కైరా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెల్సిందే. 
 
కాగా, స్పెషల్‌ సాంగ్‌లో రకుల్‌ యాక్ట్‌ చేయటం ఇదే తొలిసారి. గతంలో చరణ్‌, రకుల్‌ 'బ్రూస్‌లీ', 'ధృవ' చిత్రాల్లో కలిసి నటించారు. మూడోసారి ఈ జోడీ ప్రత్యేక పాట ద్వారా మెస్మరైజ్‌ చేయడానికి సిద్ధమవుతోంది. ఇందులో బాలీవుడ్‌ నటుడు వివేక్‌ ఒబేరాయ్ విలన్‌గా నటిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు