తెలుగు చలన చిత్ర పరిశ్రమలోకి ఎంత వేగంగా వచ్చిందో అంత వేగంగా అగ్రస్థానానికి చేరుకున్న కథానాయికల జాబితాలో రకుల్ ప్రీత్ సింగ్ కూడా కనిపిస్తారు. స్టార్ హీరోలందరితోనూ వరుసబెట్టి సినిమాలు చేసేసి విజయాలను అందుకున్న ఈ ముద్దుగుమ్మ... గ్లామర్ పరంగానూ... నటన పరంగానూ మంచి మార్కులు కొట్టేస్తోంది. అయితే ఇటీవలి కాలంలో ఆమెను విజయాలు ఎంత వేగంగా వరించాయో... పరాజయాలు కూడా అంతే వేగంగా పలకరిస్తున్నాయి.
ఆవిడకి తెలుగు... తమిళ భాషలలో సక్సెస్ అనే మాట వినబడి చాలా కాలమైంది. ఈ నేపథ్యంలోనే ఆమెకి 'మన్మథుడు 2' సినిమా నుండి ఆఫర్ అందింది. ఇప్పుడున్న సీనియర్ హీరోయిన్లు అందరూ ఇప్పటికే కింగ్ నాగార్జునతో కలిసి చేసేసి ఉండడంతో ఈ పాత్ర కోసం రకుల్‌ను సంప్రదించారట. అయితే సదరు పాత్రకు పారితోషికంగా ఆవిడ రూ. 2 కోట్లు అడిగిందట. సీనియర్ హీరోయిన్ల కొరత కారణంగా, రకుల్ అడిగినంత ఇవ్వడానికి నిర్మాతలు సిద్ధపడినట్లుగా సమాచారం.