మహేష్ బాబుతో జోడీ కట్టడం మహాదృష్టం : రకుల్ ప్రీత్ సింగ్
మంగళవారం, 23 ఆగస్టు 2016 (13:10 IST)
టాలీవుడ్ యంగ్ హీరోయిన్లలో ఒకరైన రకుల్ ప్రీత్ సింగ్ తెగ ఉప్పొంగిపోతోంది. ఏదో అదృష్టం తలుపుతట్టినట్టుగా ఫీలైపోతోంది. దీనికి కారణం.. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన నటించే అవకాశం రావడమే.
ఈ భామ ఇప్పటికే అల్లు అర్జున్.. చరణ్.. ఎన్టీఆర్‌లతో కలిసి నటించింది. తాజాగా మహేశ్ తోను జోడీ కడుతోంది. మురుగదాస్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా తదుపరి షెడ్యూల్ షూటింగ్, హైదరాబాద్‌లో మొదలైంది.
దీనిపై రకుల్ ప్రీత్ సింగ్ స్పందిస్తూ.. మహేశ్ జోడీ కట్టే ఛాన్స్ రావడం.. ఆయనతో కలిసి నటించడం ఎంతో ఆనందంగా ఉందని అంటోంది. కాగా, మహేశ్‌తో తొలిసారిగా నటిస్తోన్న రకుల్ సంతోషంతో పొంగిపోతోంది.