అలాగే, ఓ తమిళ చిత్రంతో పాటు మరోవైపు బాలీవుడ్‌లో అజయ్ దేవగణ్ హీరోగా చేస్తున్న 'దే దే ప్యార్ దే' సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రంలో అజయ్ ప్రియురాలిగా రకుల్ నటిస్తోంది. 50 సంవత్సరాల వయసులో భార్యతో విడిపోయిన అజయ్ యంగ్ హీరోయిన్ రకుల్ ప్రేమలో పడతాడు. ఆ తర్వాత వాళ్ళ జీవితంలో ఏం జరిగిందన్న కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
పూర్తి వినోదభరితంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. వయసు ఎక్కువగా ఉన్న వ్యక్తి ప్రేమలో పడే పాత్ర చాలా బాగుందని చెప్పిన రకుల్, నిజ జీవితంలో కూడా ఇలాగే నడుచుకుంటారా? అని ప్రశ్నిస్తే, ప్రేమకు వయసుతో పనిలేదని, ఒకవేళ తన మనసుకు నచ్చే వ్యక్తి దొరికితే అలాగే చేస్తానని ఏమాత్రం బిడియం లేకుండా స్పష్టంచేసింది.