'అమర్‌నాథ్ యాత్ర అద్భుతం... అమ్మ కోరిక నేరవేర్చా'... ఫేస్‌బుక్‌లో చెర్రీ...

శనివారం, 4 జులై 2015 (11:59 IST)
టాలీవుడ్ యంగ్ హీరో రామ్ చరణ్ అమర్‌నాథ్ యాత్రకు వెళ్లి వచ్చాడు. దీని గురించి చరణ్ చెబుతూ.. తాను అమర్‌నాథ్ యాత్రకు వెళ్లి రావాలనేది తన అమ్మగారి కోరిక అన్నారు. ఆమె కోరికను నెరవేర్చగలిగినందుకు సంతోషంగా ఉందన్నాడు. అమర్‌నాథ్ యాత్ర అద్భుతంగా ఉందన్నారు. ఈ విషయాన్ని చరణ్ తన ఫేస్‌ బుక్‌‌లో పోస్ట్ చేశాడు. 
 
అందులో.. "సముద్ర మట్టానికి 13 వేల అడుగుల ఎత్తులో వున్న అమర్‌నాథ్‌కు చేరుకున్నాను. అమర్‌నాథ్ యాత్ర పూర్తిచేయాలన్నది అమ్మ కల. అది నెరవేర్చాను" అంటూ చెర్రీ పోస్ట్ ఇచ్చాడు. అంతేకాదు, ఈ యాత్రలో భాగంగా తాను తీసిన అమర్‌నాథ్ అందాల ఫొటోలను కూడా చెర్రీ తన ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేశాడు. దీనికి అభిమానుల నుంచి పెద్ద సంఖ్యలో లైక్స్ వస్తున్నాయి. 

వెబ్దునియా పై చదవండి