మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా కోసం ఎన్టీఆర్, చరణ్‌ల పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. భారీ చిత్రాల నిర్మాత డి.వి.వి దానయ్య టాలీవుడ్లో అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత చేసే సినిమాను ఎన్టీఆర్ ఎనౌన్స్ చేసాడు కానీ.. చరణ్ ఆర్ఆర్ఆర్ తర్వాత చేసే సినిమా ఏంటి అనేది ఇంకా ఫైనల్ చేయలేదు. దీంతో ఆర్ఆర్ఆర్ షూటింగ్‌కి ఏమాత్రం గ్యాప్ దొరికినా చరణ్ కథలు వింటున్నారని తెలిసింది.
అయితే... లూసీఫర్ రీమేక్‌లో చిరంజీవితో పాటు చరణ్ కూడా నటిస్తున్నారు. ఈ సినిమాని ఆర్ఆర్ఆర్ కంప్లీట్ అయిన తర్వాత అలాగే చిరంజీవి కొరటాల సినిమా కంప్లీట్ అయిన తర్వాత స్టార్ట్ చేస్తారు. ఇదిలా ఉంటే.. చరణ్ సోలోగా చేసే సినిమా కథ విషయంలో చాలా కేర్ తీసుకుంటున్నారు. జెర్సీ సినిమాలో సెన్సేషన్ క్రియేట్ చేసిన గౌతమ్ తిన్ననూరి జెర్సీ సినిమాని బాలీవుడ్లో రీమేక్ చేస్తున్నారు.
ఈ సినిమా తర్వాత చరణ్ గౌతమ్‌తో సినిమా చేయనున్నాడని.. ఈ ప్రాజెక్ట్ ఫైనల్ అయినట్టు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత చరణ్ మనం ఫేమ్ విక్రమ్ కుమార్‌తో సినిమా చేయనున్నాడు. మనం సినిమా తర్వాత నుంచి విక్రమ్‌తో చరణ్ సినిమా చేయాలనుకున్నారు. ఇప్పటికి సెట్ అయ్యిందని.. వీరిద్దరి కాంబినేషన్లో మూవీ ఖచ్చితంగా ఉంటుందని వార్తలు వస్తున్నాయి.
ఎప్పటి నుంచో యు.వి. క్రియేషన్స్ చరణ్‌తో సినిమా చేయాలనుకుంటున్నారు కానీ.. సెట్ కాలేదు. ఇప్పుడు చరణ్‌తో సినిమా చేసేందుకు యు.వి. క్రియేషన్స్ ప్రయత్నాలు చేస్తుంది. ఇటీవల చరణ్‌ని కలిసి వంశీ, ప్రమోద్ ఈ విషయం గురించి చరణ్‌తో చర్చించారని తెలిసింది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌తో సాహో చిత్రాన్ని తెరకెక్కించిన యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ సుజిత్ చరణ్ కోసం ఓ కథ రెడీ చేసాడని తెలిసింది.
సుజిత్ చెప్పిన కథకి చరణ్ ఓకే చెప్పాడని టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. సాహో సినిమా వలే ఈ సినిమాని కూడా భారీ స్ధాయిలో ప్లాన్ చేస్తున్నారని.. స్టోరీ లైన్ విని చరణ్ ఫుల్ స్ర్కిప్ట్ రెడీ చేయమని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. మార్చి లేదా ఏప్రిల్ నెలలో ఫుల్ స్ర్కిప్ట్ రెడీ చేసి ఫైనల్ వెర్షెన్ వినిపిస్తానని సుజిత్ చెప్పాడని.. దాదాపు ఈ ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అని తెలిసింది. ఇలా.. విక్రమ్ కుమార్, గౌతమ్ తిన్ననూరి, సుజిత్.. పేర్లు ప్రచారంలో రావడంతో వీరిలో చరణ్‌తో వెంటనే సినిమా చేసే ఛాన్స్ ఎవరు దక్కించుకుంటారు అనేది ఆసక్తిగా మారింది.