పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సెప్టెంబర్ 2న. ఆ రోజు అభిమానులకు పండగ రోజు. ప్రతి సంవత్సరం పవన్ పుట్టినరోజున అభిమానులు పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేస్తుంటారు. ఈసారి జనసేన పార్టీ కార్యకర్తలు తమ పార్టీ అధ్యక్షుడు పవన్ పుట్టినరోజును స్పెషల్‌గా సెలబ్రేట్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే... మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బాబాయ్ పుట్టినరోజున ఫ్యాన్స్‌ని సర్‌ఫ్రైజ్ చేయనున్నాడని వార్తలు వస్తున్నాయి.