నాకేదైనా ఈర్ష్య ఉందంటే అది నీ మీదే అని డాడీ అన్నారు.. రాంచరణ్

మంగళవారం, 21 ఆగస్టు 2018 (17:03 IST)
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ప్రతిష్టాత్మక 151వ చిత్రం సైరా నరసింహా రెడ్డి. ఈ చిత్రాన్ని ఆయన తనయుడు రాం చరణ్ నిర్మిస్తుండగా, సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం టీజర్‌ను చిరంజీవి పుట్టిన రోజు (ఆగస్టు 22)కు ఒక రోజు ముందు అంటే ఆగస్టు 21వ తేదీన రిలీజ్ చేశారు.
 
ఈ టీజర్ రిలీజ్ ఈవెంట్ ప్రసాద్ ల్యాబ్స్‌లో వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా జరిగిన ప్రెస్‌మీట్‌లో ఈ చిత్ర నిర్మాత రామ్ చరణ్ మాట్లాడుతూ,  నా సినీ కెరీర్ బిగినింగ్‌లో నాన్నగారు ఒక్కటే అన్నారు. నాకు బాగా గుర్తుంది... 'నాకేదైనా నీపై ఈర్ష్య ఉందంటే అది.. రెండో సినిమాకే మంచి సోషియో ఫాంటసీ.. మంచి కాస్ట్యూమ్ డ్రామా సినిమా చేశావు. నేను 35-40 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ఉంటూ 150 సినిమాలు చేశాను. నాకు ఇప్పటి వరకూ ఒక్క కాస్ట్యూమ్ డ్రామా సినిమా రాలేదని' అన్నారు. 
 
దానికి ఉదాహరణే సైరా నరసింహారెడ్డి సినిమా. కాబట్టి దీనికి ఖర్చు కానీ.. ప్రాఫిట్స్ కానీ చూడటంలాంటివేమీ పెట్టుకోకుండా ఆయనకు కావల్సినట్టు ఈ సినిమా తీయడమే నాకో బ్లెస్సింగ్ అని చెర్రీ చెప్పుకొచ్చారు. అదేసమయంలో ఈ చిత్రం బడ్జెట్ట వివరాలను ఇపుడే బహిర్గతం చేయదలచుకోలేదన్నారు. కానీ, భారీ బడ్జెట్‌తోనే తీస్తున్నాం. డాడీ డ్రీమ్ ప్రాజెక్ట్ కాబట్టి దేనికీ వెనకాడకుండానే సినిమా తీస్తున్నాం. ముందే చెప్పాను నేను. ప్రాఫిట్ వస్తే బోనస్.. రాకపోతే ఇంకా అంతకన్నా ఆనందం ఉండదు. ఎందుకంటే ఆయనకు కావాల్సింది మొత్తం తీశాం అని చెర్రీ ముక్తాయింపునిచ్చారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు