బాహుబలి-2 ట్రైలర్ గురువారం థియేటర్లలో రిలీజ్ అయ్యింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియా ద్వారా తనదైన శైలిలో స్పందించాడు. బాహుబలి-2 ట్రైలర్ సినిమాలకు అమ్మలాంటి ట్రైలర్ కాదని, అమ్మమ్మలాంటిదంటూ పొగడ్తల వర్షం కురిపించాడు. ఇదే సమయంలో డైరెక్టర్ రాజమౌళిపై తన అభిమానాన్ని చాటుకున్నాడు. మూవీని ఈ స్థాయిలో తీర్చిదిద్దిన జక్కన్నకి 'మెగా బాహుబలి' సెల్యూట్ అంటూ ట్వీట్ చేశాడు.
ఇదిలా ఉంటే.. బాహుబలి ది బిగినింగ్‌ను ఎక్కడైతే జక్కన్న ముగించాడో.. అక్కడ నుంచే బాహుబలి-2 ట్రైలర్‌ను కంటిన్యూ చేశాడు రాజమౌళి. ఎమోషన్స్‌తో డైరెక్టర్ ఓ ఆట ఆడుకున్నాడని ఆ ట్రైలర్‌ను బట్టి తెలుసుకోవచ్చు. లొకేషన్స్ చూసినవాళ్లకు మాత్రం రామోజీ ఫిల్మ్‌సిటీ, కేరళలోని ఫారెస్ట్‌లో షూటింగ్ ఫినిష్ చేసినట్టు వుందని.. రెండేళ్ల కిందట షూట్ చేసిన పాత విజువల్స్ కూడా ఈ వీడియోలో కనిపించాయి. బాహుబలి-2 ట్రైలర్‌లో క్యారెక్టర్లను అందంగా చూపించాడు.