వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎపుడు ఎలాంటి ట్వీట్ చేస్తారో ఎవరికీ అంతుచిక్కదు. మెగా కాంపౌండ్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించిన ఆర్జీవీ... ఇపుడు ఉన్నట్టుండి పొగడ్తల వర్షం కురిపించాడు. నిజానికి చిరంజీవి నటించిన తాజా చిత్రం 'ఖైదీ నెం.150' మూవీ ప్రి రిలీజ్ ఫంక్షన్‌లో నాగబాబు ఎపీసోడ్ నుంచి మెగాఫ్యామిలికీ వర్మకు మధ్య వేడి వాతావరణం కొనసాగింది. నాగబాబు వ్యాఖ్యలకు కౌంటర్‌గా వరుస ట్వీట్లతో వర్మ విరుచుకుపడ్డాడు.
తన ట్వీట్ల పరంపరను ఆపేశాడు. అయితే ఇప్పుడు తాజాగా చిరును ఆకాశానికెత్తేశాడు. ఇప్పుడే 150 మూవీ చూశానని, సినిమా చాలా అద్భుతంగా ఉందని చెప్పాడు. 9 సంవత్సరాల క్రితం సినిమాలను వదిలేసినప్పటి కంటే ఇప్పుడు మరింత యవ్వనంగా ఉన్నారని ట్వీట్ చేశాడు. తన ఎనర్జీ లెవల్స్ చాలా అద్భుతంగా ఉన్నాయంటూ ఆకాశానికెత్తేశాడు వర్మ.