పిఠాపురంకు బయలుదేరిన రామ్ చరణ్, సురేఖ, అల్లు అరవింద్

డీవీ

శనివారం, 11 మే 2024 (11:36 IST)
ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ వేడి క్లయిమాక్స్‌కు చేరుకుంది. మరికొన్ని గంటల్లో ప్రచారానికి తెరపడనుంది. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి తన సోదరుడు పవన్ కళ్యాణ్‌కు ప్రచారం చేయడానికి వెళ్లలేదనే టాక్ వున్నా, అందుకు క్లారిటీ ఇస్తూ, తాను రానవసరంలేదని పవన్ చెప్పారని అందుకే తాను వెళ్ళలేదని చిరంజీవి వెల్లడించారు. తాజాగా ఆయన తరపున కొడుకు రామ్ చరణ్, భార్య సురేఖ, బావమరిది అల్లు అరవింద్ నేడు పిఠాపురం బయలుదేరారు.
 
 
కొద్దిసేపటి క్రితం హైదరాబాద్ నుంచి రాజమండ్రి వెళ్ళారు. ఈ సందర్భంగా ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. రాజమండ్రిలో పిఠాపురంలోని శ్రీ కుక్కుటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసుకోనున్నారు. ఈ సందర్భంగా పవన్ అత్యధిక మెజార్టీతో గెలవాలనీ వారు ఆకాంక్షిస్తూ ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఇప్పటికే మెగా ఫ్యామిలీ హీరోలు, జబర్‌దస్త్ నటీనటులు కూడా పవన్ కోసం ప్రచారం చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు