లిప్ లాక్‌తో ప్రారంభమైన రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన్న ప్రేమ

బుధవారం, 11 అక్టోబరు 2023 (13:46 IST)
Ranbir Kapoor and Rashmika
రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన్న వారి ఇంటెన్స్ కెమిస్ట్రీ తో కట్టిపడేశారు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న ‘యానిమల్’ నుంచి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రొమాంటిక్ ట్రాక్ 'అమ్మాయి' పాట విడుదలైయింది.
 
రాఘవ చైతన్య పాడిన ఈ సోల్ ఫుల్ మెలోడీకి అనంత శ్రీరామ్ అద్భుతమైన లిరిక్స్ అందించగా మెలోడీ మాస్ట్రో ప్రీతమ్ మెస్మరైజింగ్ నెంబర్ ని కంపోజ్ చేశారు. ప్రీతమ్, రణబీర్ కపూర్ గతంలో చార్ట్ బస్టర్ ఆల్బమ్స్ తో అలరించారు. ప్రేక్షకులకు మరపురాని సంగీత అనుభూతిని అందించే 'అమ్మాయి' పాటతో వారి అద్భుతమైన మ్యూజికల్ మ్యాజిక్ ని కొనసాగించారు.
 
లవ్ సాంగ్‌లో అందమైన మెలోడీ తో పాటు.. లీడ్ పెయిర్ రణబీర్ కపూర్, రష్మిక మందన్నల మధ్య కెమిస్ట్రీ కూడా బ్యూటీఫుల్ గా వుంది. ఇద్దరూ తమ ప్రేమను రష్మిక కుటుంబానికి పరిచయం చేయడంతో పాట ప్యాసనేట్ లిప్ లాక్‌తో ప్రారంభమవుతుంది.  
 
ఇద్దరు స్టార్స్ మధ్య ఎలక్ట్రిఫైయింగ్, ప్యాషనేట్ కిస్ ని ప్రజెంట్ చేసిన సాంగ్  పోస్టర్ ఆసక్తి, అంచనాలని భారీ అంచనాలను పెంచింది. 'అమ్మాయి' పాట అంచనాలని అందుకొని విజువల్, మ్యూజికల్ ట్రీట్‌గా అలరించింది.
హిందీలో 'హువా మెయిన్',  తెలుగులో 'అమ్మాయి' పాట అంచనాలని అందుకొని  విజువల్, మ్యూజికల్ ట్రీట్‌గా అలరించి యానిమల్ పై మరింత క్యురియాసిటీని పెంచింది.  
 
మనసుని హత్తుకొనే 'అమ్మాయి' పాట ఈ ఏడాది రొమాంటిక్ నెంబర్ గా ఆడియన్స్ అలరిస్తోంది.
 
'యానిమల్' ని భూషణ్ కుమార్ & క్రిషన్ కుమార్ టి-సిరీస్, ప్రణయ్ రెడ్డి వంగా భద్రకాళి పిక్చర్స్ నిర్మించాయి. ఈ చిత్రం డిసెంబర్ 1న హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం 5 భాషల్లో విడుదల కానుంది.
 
తారాగణం: రణ్‌బీర్ కపూర్, అనిల్ కపూర్, రష్మిక మందన్న, బాబీ డియోల్, త్రిప్తి దిమ్రీ

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు