రంగస్థలం సినిమా బంపర్ హిట్ అయిన నేపథ్యంలో.. డార్లింగ్, బాహుబలి హీరో ప్రభాస్‌తో సినిమా చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నాడు దర్శకుడు సుకుమార్. సుకుమార్ మెగా హీరో అల్లు అర్జున్‌తో సినిమా చేస్తాడని ప్రచారం జరిగినా.. అలాంటిదేమీ లేదని సుకుమార్ చెప్తున్నాడు. కథను బట్టి హీరోను ఎంపిక చేసుకుంటానని సుకుమార్ చెప్పుకొచ్చారు.
అయితే సుకుమార్ తన తదుపరి సినిమా ప్రభాస్‌తో చేయవచ్చునని టాక్ బలంగా వినిపిస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సుకుమార్ మాట్లాడుతూ .. ప్రభాస్‌తో ఒక సినిమా చేయాలని ఉందని చెప్పడం ఈ ప్రచారానికి బలం ఇస్తోంది. ఇప్పటికే ప్రభాస్‌తో సుకుమార్ చర్చలు కూడా జరిపేశారని.. సుకుమార్‌తో సినిమా చేసేందుకు డార్లింగ్ కూడా సిద్ధంగా వున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే.. బాహుబలి స్టార్ ప్రభాస్, బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ జంటగా నటిస్తున్న సాహో సినిమా షూటింగ్ అబుదాబిలో జరుగనుంది. ఈ నెల పదో తేదీ నుంచి అబుదాబిలోని వివిధ ప్రాంతాల్లో రెగ్యులర్ షూటింగ్ జరగనుంది.