ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన సినిమా ''రంగస్థలం''. రామ్ చరణ్, సమంత కాంబినేషన్‌లో విడుదలైన ఈ సినిమా రికార్డులను కొల్లగొడుతోంది. రామ్ చరణ్ నటన, సమంత పలికించిన హావభావాలు, సుకుమార్ దర్శకత్వ శైలికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఈ సినిమాకు చంద్రబోస్ అందించిన సాహిత్యానికి కూడా ప్రశంసల వర్షం కురుస్తోంది.
ఎంత సక్కగున్నవే.. పాటకు ఇప్పటికే పాటకు శ్రోతల నుంచి మంచి స్పందన వస్తోంది. సోషల్ మీడియాలో ఈ పాటకు ఇప్పటికే 25 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. ఇదే జోష్‌లో చిత్ర యూనిట్ తాజాగా ''ఓరయ్యో సాంగ్ లిరికల్ వీడియో''ను విడుదల చేసింది. ఈ పాట శ్రోతల గుండెల్ని పిండేస్తోంది. కథాపరంగా ఆదిపినిశెట్టి మరణిస్తే.. ఆతని తండ్రి పాడే చందంగా వున్న ఈ పాట ప్రేక్షకుల గుండెల్ని పిండేస్తోంది. ఈ పాట లిరిక్స్ మీరూ ఓసారి తిలకించండి.