అనసూయను చూసి నేర్చుకో... రష్మీ గౌతమ్ కెరీర్ అంతేనా?

శుక్రవారం, 31 ఆగస్టు 2018 (18:02 IST)
బుల్లితెరపై యాంకర్‌గా వెండితెర యాక్టర్‌గా అదరగొడుతున్న రష్మీ గౌతమ్‌పై కొత్త ఇమేజ్ పడనుందని టాలీవుడ్ వర్గాల్లో టాక్ మొదలైంది. బుల్లితెరపై వచ్చినంత క్రేజ్ సినిమాల ద్వారా రష్మీ తెచ్చుకోలేకపోతుందని టాక్. కొన్ని సినిమాలు కేవలం డబ్బు కోసమే చేస్తుంటానని రష్మీ ఓపెన్‌గానే స్టేట్మెంట్ ఇచ్చింది. కానీ  గుంటూరు టాకీస్ తప్ప నటిగా ఆమెకు ఏ సినిమా కూడా సరైన సక్సెస్‌ను అందించలేకపోయింది. 
 
కానీ సరైన కథలను ఎన్నుకోవడంలో ఆమె పూర్తిగా విఫలమైంది. ఒక్క సినిమా కూడా కంటెంట్ ప్రాధాన్యత గల రోల్ చేయలేదు. అన్నీ ఆమెకు హాట్ ఇమేజ్‌ను తీసుకొచ్చే కథలే. దీంతో నటిగా నిరూపించుకునే అవకాశం లేకుండా పోయింది. రీసెంట్‌గా 'అంతకుమించి' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అసలు ఈ సినిమాలోనూ రష్మీ గ్లామర్ షో చేసింది. 
 
అయితే రష్మితో పాటే క్రేజ్ తెచ్చుకున్న అనసూయ మాత్రం కథల విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ నటిగా తనను తాను నిరూపించుకుంటోంది. కానీ రష్మి మాత్రం ప్రేక్షకులను పరీక్ష పెట్టే సినిమాలు చేస్తూ తన కెరీర్‌ని నాశనం చేసుకుంటుందని టాక్ వస్తోంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు