రష్మీ గౌతమ్‌ నీ రాసలీలలు బయటపెడతా..? వార్నింగ్ ఇచ్చిన నెటిజన్

గురువారం, 2 మే 2019 (12:11 IST)
జబర్దస్త్ ద్వారా బుల్లితెరపై ఓ వెలుగు వెలుగుతున్న అందాల తార రష్మీ గౌతమ్‌కు బెదిరింపులు వస్తున్నాయట. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా వుండే రష్మీకి బెదిరింపుల ద్వారా ప్రస్తుతం కొత్త చిక్కు వచ్చి పడింది.


ఓ నెటిజన్ రష్మీ గౌతమ్‌ను సోషల్ మీడియా వేదికగా బెదిరించాడు. '' రష్మీ నీ రాసలీలలు బయటపెడతా.. అంటూ పోస్టు చేశారు. ఈ పోస్టుకు రిప్లై‌గా దయచేసి ఇలాంటి పోస్ట్స్ పెట్టొద్దు. దయచేసి మీరు పెట్టిన పోస్ట్స్‌ను డిలీట్ చేయమంటూ ఆ నెటిజెన్‌కు రష్మీ అభిమానులు విజ్ఞప్తి చేశారు.
 
అయితే ఈ పోస్టుపై రష్మీ రంగంలోకి దిగింది. దీనిపై సీరియస్‌గా వ్యవహరించింది. "నీ దగ్గర నాకు చెందిన వీడియోలు ఉంటే బయటపెట్టు. నేను ఏ తప్పు చేయలేదు కాబట్టే వాటిని స్వాగతిస్తున్నా" అంటూ రష్మీ గట్టి కౌంటరే ఇచ్చింది.
 
ఇంకేముంది.. ఏమాత్రం జడుసుకోకుండా సోషల్ మీడియాలో ఇంటర్వ్యూల్లో బదులిచ్చే రష్మీ.. బుల్లితెరపై బాగానే మెరుస్తోంది. ఇక సుధీర్‌తో తన లవ్ ఎంతవరకు నిజమో కాని.. ఇదే కాన్సెప్ట్ బేస్ చేసుకుని చేస్తున్న స్పెషల్ షోలకి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ పండి అత్యధిక వ్యూయర్ షిప్‌ని సంపాదించి పెడుతుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు